టాలీవుడ్ ఇండస్ట్రీలో 2021లో అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాగా జాతిరత్నాలు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే సినిమా సక్సెస్ తో నవీన్ పొలిశెట్టి జాతకమే మారిపోయింది. చాలా మంది నిర్మాతలు అతని డేట్స్ కోసం ఎగబడుతున్నారు. అయితే ప్రభాస్ కూడా నవీన్ కి ఒక ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందరూ జాతిరత్నాలు హిట్టయిన తరువాత ఛాన్స్ ఇస్తే ప్రభాస్ మాత్రం అంతకంటే ముందే అతనికి అవకాశం వచ్చేలా చేశాడని సమాచారం. అనుష్క యూవీ కాంబినేషన్ లో రానున్న సినిమాలో నవీన్ హీరోగా సెలెక్ట్ అయినట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే దర్శకుడు మహేష్ హీరోకోసం సెర్చ్ చేస్తున్న సమయంలో ప్రభాస్ సలహా మేరకు నవీన్ ను తీసుకున్నారట. ఎందుకంటే ప్రభాస్ చిచోరే సినిమాలో నవీన్ నటనకు ఫిదా అయ్యాడట. ఇక అనుష్క చేయబోయే సినిమాకు అతను కరేక్ట్ గా సెట్టవుతాడాని సలహా ఇవ్వడంతో యూవీ క్రియేషన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment