రానా పాన్ ఇండియా సినిమా అరణ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 60కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. విడుదల తరువాత కూడా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ అందుకోవడంలో దారుణంగా విఫలమైంది.
అయితే సినిమా నిడివి మరీ ఎక్కువయ్యిందనే కామెంట్స్ రావడంతో చిత్ర యూనిట్ తగ్గించేందుకు రెడీ అయినట్లు సమాచారం. దాదాపు 38నిమిషాల సీన్స్ ను ట్రిమ్ చేసినట్లు సమాచారం. 2గంటల 44 నిమిషాల సినిమా ఇప్పుడు 2గంటల 6నిమిషాలు అయినట్లు సమాచారం. అయితే ఇదేదో ముందే చేసి ఉంటే కలెక్షన్స్ పై అంత ప్రభావం పడి ఉండేది కాదు. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కనీసం 5కోట్ల షేర్ కూడా అందుకోలేదని సమాచారం. నాన్ థియేట్రికల్ గా 45కోట్ల వరకు రావడం వలన భారీ నష్టాల నుంచి తప్పించుకుంది.
Follow @TBO_Updates
Post a Comment