నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పై రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పనులు ఇంకా చాలా ఉన్నాయి. బోయపాటి పర్ఫెక్షన్ కోసం షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నట్లు టాక్ అయితే వస్తోంది. కానీ నిర్మాత నమ్మకంతో ముందుగానే మే 28 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ విడుదల కానుందని ప్రకటించారు.
ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సినిమా వాయిదా పడవచ్చని తెలుస్తోంది. ఇంకా 40 శాతం షూటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులను పూర్తి చేయడానికి మూవీ యూనిట్ విరామం లేకుండా పనిచేస్తోంది. అయితే యాక్షన్ సన్నివేశాల దగ్గర బోయపాటి కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నట్లు టాక్. మరోవైపు కరోనావైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడంతో నిర్మాతల్లో అది కూడా కొంత భయాన్ని కలిగిస్తోంది. షూటింగ్ కు ఏ మాత్రం బ్రేక్ పడినా కూడా రిలీజ్ డేట్ ను మార్చక తప్పదు. మరి బోయపాటి సినిమాను ఎంత స్పీడ్ గా ఫినిష్ చేస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment