కోవిడ్ కారణంగా కొన్ని సినిమాలపై ప్రభావం పడినప్పటికి మరికొన్ని మంచి సినిమాలు మాత్రం పవర్ఫుల్ కలెక్షన్స్ అందుకున్నాయి. నెలకొక హిట్టు సినిమా పడడంతో వాతావరణం అంతా సెట్టయ్యిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మళ్ళీ విషమంగా మారుతుతున్నాయి. కరోనా తీవ్రత పెరగడంతో దేశంలో మళ్ళీ లాల్ డౌన్ వైపు నిర్ణయాలు వెళుతున్నాయి.
ఇప్పటికే స్కూల్స్ కాలేజీలు మూతపడ్డాయి. క్రీడలకు సంబంధించిన స్టేడియంలలో ఆడియెన్స్ ను అనుమతించడం లేదు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రద్దీగా ఉండే మాల్స్ సినిమా థియేటర్లపై కూడా ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. కుదిరితే థియేటర్స్ మళ్ళీ 50% ఆక్యుపెన్సీతో నడిచే అవకాశం ఉందట. ఈ విషయంపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఈ నెల 26న అరణ్య, రంగ్ దే సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment