రాజకీయ నాయకుడిగా మారిన యాక్టర్ కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను ప్రకటించాడు. మక్కల్ నీది పార్టీ తరపు నుంచి తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల నామినేషన్ వేశారు. ఇక అందులో రూ.176.9 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. కమల్ కోయంబత్తూర్ సౌత్ నుండి నామినేషన్ దాఖలు చేశారు. కమల్ తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆదాయ వివరాలను ప్రకటించారు.
ఇక 2019-20 సంవత్సరానికి ఆయన పన్ను రాబడి రూ .12.1 కోట్లు. ఆస్తులతో పాటు, కమల్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాట్లు పేర్కొన్నారు. మరోవైపు, కమల్ హాసన్ ఎంఎన్ఎమ్ పార్టీ ఉపాధ్యక్షుడు వనిల్లా ఆర్. మహేంద్రన్ రూ .160 కోట్లతో రెండవ ధనవంతుడిగా ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక ఈ సారి కమల్ హాసన్ ఎలాగైనా ఎన్నికల్లో తనదైన శైలిలో ముద్ర వేయాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ ఆయన విక్రమ్ అనే సినిమా రాబోతున్నారు. మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment