హీరోల కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎగబడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇష్టమైన హీరో కనిపిస్తే ముందు వెనుక ఏమి చూడకుండా పటిగేడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లుఆ హడావుడిలో అనుకోకుండా ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇక ఇటీవల శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఓ అభిమాని గాయపడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ రాకతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో శివ అనే వ్యక్తి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక రెండు రోజుల నుంచి హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్న ఆ యువకుడు నేడు ప్రాణాలు కోల్పోయాడు. మరి ఈ ఘటనపై చిత్ర యూనిట్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment