టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఒక మంచి కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకుంటోంది. జాతిరత్నాలు మొదటి షో నుంచి కూడా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. సినిమా హిట్టవ్వడంతో నవీన్ పొలిశెట్టి దశ కూడా తిరిగింది. నిజానికి ఈ స్థాయిలో హిట్ అందుకోవడానికి అతనికి 10ఏళ్లు పట్టింది. సాఫ్ట్ వేర్ జాబ్ కెరీర్ ను వదిలేసుకొని నటుడిగా సక్సెస్ అవ్వాలని ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు.
మొత్తానికి జాతిరత్నాలు సక్సెస్ కావడంతో మనోడు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. కామెడీ టైమింగ్ తో ఆడియెన్స్ కు బాగా దగ్గరవ్వడంతో అగ్ర నిర్మాతల చూపు ఇప్పుడు అతనివైపే ఉంది. నిన్నటి నుంచి అతనికి బడా నిర్మాతల నుంచి కాల్స్ అయితే గట్టిగానే వస్తున్నాయట. అయితే ముందే కమిట్మెంట్స్ ఇవ్వకుండ కథ విన్న తరువాతే ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఈ హీరో ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment