దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల ఫ్రాడ్ కాల్ ద్వారా మోసపోయిన వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అది ఎంతవరకు నిజం అనే విషయంలో నిన్నటివరకు కూడా స్పందించని వెంకీ కుడుముల మొత్తానికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. మోసం చేసిన వ్యక్తి తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాడు. భీష్మ సినిమాలో ఆర్గానికి ఫార్మింగ్ ఉంది కాబట్టి నేషనల్ అవార్డ్ కు అప్లై చేసుకోమ్మని చెప్పడంతో తప్పు లేదనే కారణం చేత మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా సదరు వ్యక్తికి 66వేల రూపాయలు డబ్బులు పంపినట్లు చెప్పాడు.
అయితే ఇది మోసమని తెలిశాక పోలీస్ కంప్లైట్ ఇవ్వవద్దని చాలా మంది స్నేహితులు సలహాలు ఇచ్చినప్పటికీ తన మనసు ఒప్పుకోలేదని చెప్పిన వెంకీ తనలాగా మరొకరు మోసపోవద్దని అన్యాయాన్ని బయటకు తీసినట్లు చెప్పాడు. తప్పు జరిగితే.. తప్పు జరిగింది. మిగతా వాళ్లకు ఇలా జరగకూడదని కంప్లైంట్ చేయడంలో తప్పు లేదు అనిపించింది.. పొగ తాగుట, మద్యం సేవించుటే కాదు.. అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే.. సమాజంలో తప్పు జరిగితే కచ్చితంగా మీ గొంతుకను వినిపించండని వెంకీ కుడుముల అసలు వివరణ ఇచ్చాడు.
Follow @TBO_Updates
Post a Comment