టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకునేలా ఉంటాయి. సినిమాను జనాల్లోకి ఎలా తీసుకువెళ్ళాలో దిల్ రాజుకు బాగా తెలుసు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా ఇష్టపడతారు.
అయితే ఇంతవరకు దిల్ రాజు నందమూరి బాలకృష్ణతో సినిమా చేయలేదు. అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. వరుసగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో హిట్స్ అందుకుంటున్న అనిల్ రావిపూడి బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గతంలో రామరావు అనే టైటిల్ తో కథను కూడా వినిపించాడు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఆ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కవచ్చని టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment