నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి దర్సకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. BB3 హ్యాష్ ట్యాగ్ తో కొనసాగుతున్న ఈ సినిమా టైటిల్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ అప్పుడే బిజినెస్ భారీ స్థాయిలో నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింహా, లెజెండ్ వంటి సినిమాల అనంతరం వీరి కాంబోలో వస్తున్న సినిమాలు కాబట్టి అంచనాలు భారిగానే ఉన్నాయి.
ఇక సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రైడ్ సినిమా సంస్థ 2కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సమయంలో సినిమాకు ఇది డిసెంట్ డీల్ అని చెప్పవచ్చు. మొదట 3కోట్లకు అమ్ముతున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు 2కోట్లకే డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. ఇక సినిమాను మే 28న రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment