బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ ను అందుకోవడం కొన్నిసార్లు చాలా ఈజీ అవుతుంది. ఇక మరికొన్ని సినిమాలు టార్గెట్ మధ్యలోనే అలసిపోతాయి. ప్రస్తుతం రానా, నితిన్ సినిమాల పరిస్థితి అలానే ఉంది. అరణ్య సినిమా 13కోట్ల బ్రేక్ ఈవెన్ తో మార్కెట్ లోకి రాగా ఇప్పటివరకు కనీసం 5కోట్ల షేర్ రాబట్టలేకపోయింది, డీసస్టర్ దిశ గా వెళ్తుంది.
ఇక రంగ్ దే సినిమా కూడా సక్సెస్ అవ్వాలి అంటే మరో 10కోట్లు రాబట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టార్గెట్ ను టచ్ చేయడం కష్టమే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ శుక్రవారం మరో రెండు విభిన్నమైన సినిమాలు రానున్నాయి. నాగార్జున వైల్డ్ డాగ్, కార్తీ సుల్తాన్ భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. దీంతో అరణ్య, రంగ్ దే ఏప్రిల్ 2లోపే వీలైనంత వరకు కలెక్షన్స్ రాబట్టాలి. మరి ఈ మూడు రోజుల్లో టార్గెట్ కు ఎంత దగ్గరగా వెళతారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment