లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తదుపరి సినిమా పై మరోసారి రూమర్స్ వైరల్ అవుతున్నాయి. భాగమతి అనంతరం నిశ్శబ్దం సినిమాతో డిజాస్టర్ అందుకున్న దేవసేన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద అసలైన హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం మహేష్ అనే దర్శకుడితో ఆమె ఒక కథపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ పూర్తయిన తరువాతనే సినిమాపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక హీరోగా యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టితో నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. నిజంగా ఈ కాంబినేషన్ సెట్టయితే మూవీ పైన క్రేజ్ క్రియేట్ అవ్వడం కాయం. ఇక సినిమాలు చేయడంలో కాస్త స్పీడ్ తగ్గించిన అనుష్క ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా వెంటనే ఒప్పేసుకోవడం లేదట. కేవలం తనకు సెట్టయ్యే కథలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నవీన్ పొలిశెట్టి కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment