మొదటి సినిమా మిర్చి తప్పితే దాదాపు అన్ని సినిమాల్లో కూడా ఏదో ఒక సోషల్ మెస్సేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కొరటాల శివ. సమాజం పట్ల ఉన్న బాద్యతలపై తనదైన శైలిలో వివరించే కొరటాల ఆచార్య అనంతరం మరొక సోషల్ పాయింట్ ను తీసుకున్నట్లు సమాచారం. నెక్స్ట్ సినిమాలో వాటర్ పొల్యూషన్ పై స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వనున్నాడట.
మనుషులు చేసే పొరపాట్ల వలన చెరువులు సముద్రాలు ఎంతవరకు కాలుష్యం భారిన పడుతున్నాయి, ప్రతి ఒక్కరు ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నారు అనే విషయాన్ని హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే ఆ అంశం చుట్టూ పొలిటికల్ వాతావరణాన్ని కూడా యాడ్ చేశారని టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ బాధ్యతగల ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను పుష్ప విడుదల అనంతరమే స్టార్ట్ చేయాలని బన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
Follow @TBO_Updates
Post a Comment