AlluArjun - Koratala movie release date fixed?


అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్పతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా కోసం సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాను ఆగస్ట్ 13న గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. 

ఇక అల్లు అర్జున్ మరో సినిమా డేట్ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పుష్ప అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ పై దర్శకుడు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మళ్ళీ డేట్స్ దొరకడం కష్టమవుతుందని 2022 మార్చ్ 31ని ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఏండింగ్ లోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల ఆచార్య సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.



Post a Comment

Previous Post Next Post