యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపించినా కూడా తనదైన శైలిలో మెప్పించగలడని చెప్పవచ్చు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు డిజైన్ చేస్తే దర్శకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు కూడా తారక్ కోసం అలాంటి కథను చెప్పినట్లు తెలుస్తోంది. ఉప్పెనతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న బుచ్చిబాబు ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. రెండు మూడు కథలను రెడీ చేసుకోగా అందులో ఒకటి తారక్ కు సెట్టయ్యే విధంగా ఉందట. స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కబోయే ఆ కథ పిరియాడిక్ కాన్సెప్ట్ లో తెరకెక్కనుందట. ఇక జూనియర్ ఎన్టీఆర్ 50ఏళ్ళ వయసుతో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం RRR తో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం మరొక సినిమా చేసి వచ్చే ఏడాది బుచ్చిబాబు సినిమాను సెట్స్ పైకి తీసుకురావచ్చని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment