రామాయణం కథ ఆధారంగా బాలీవుడ్ నిర్మాత మధు మంతెన ఏడాది క్రితమే ఒక సినిమా చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశాడు. అయితే అనుకోకుండా లాక్ డౌన్ లో ప్రభాస్ హీరోగా ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ను ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు. దీంతో మధు మంతెన ఆ వెంటనే రామాయణం 3D లో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అన్నప్పటి నుంచి ఆ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక రామాయణం 3D లో కూడా టాలీవుడ్ స్టార్ ను సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నారు. గత కొంతకాలంగా నిర్మత మధు మహేష్ బాబుతో చర్చలు జరుపుతున్నారు. అసలైతే ఆ ప్రాజెక్ట్ లో మొదట హృతిక్ రోషన్ ను అనుకున్నారు. ఇక అతను తప్పుకోవడంతో మహేష్ పై ఫోకస్ పెట్టారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఆల్ మోస్ట్ సిద్ధమైనట్లు చెప్పారట. ఇక మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment