ఈ నగరానికి ఏమైంది 2.. or నాగ చైతన్య?


పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మంచి దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ మూడవ సినిమాపై చాలా ఆలస్యం చేస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది? సినిమాతో ఈ దర్శకుడికి యూత్ లో ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. ఎక్కడికెళ్లినా కూడా ఆ సినిమాకు సీక్వెల్ ఎప్పుడనే ప్రశ్నను ఎదుర్కొంటున్నాడు.

ఇక ఈ ఏడాది ఏండింగ్ లో ENE 2 షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు మరొక కొత్త రూమర్ వైరల్ అవుతోంది. అలాగే నాగచైతన్యతో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అసలైతే తరుణ్, వెంకటేష్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం వెంకీ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు F2 మరోవైపు దృశ్యం 2. ఇక తరుణ్ వెంకీతో చేయాల్సిన సినిమాను వాయిదా వేసుకొని నాగ చైతన్యను లైన్ లో పెట్టినట్లు సమాచారం.



Post a Comment

Previous Post Next Post