ఉప్పెనకు అసలు పరీక్ష మొదలైంది.. సస్టైన్ అవుతుందా మరి?


మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే సినిమా బాక్సాఫీస్ వద్ద హాఫ్ సెంచరీ కొట్టేసింది. అయితే సినిమా ఓపెనింగ్స్ సాలిడ్ గా ఉండడంతో తప్పకుండా గ్రాస్ పరంగా సెంచరీకి చేరువవుతుందని అంతా అనుకున్నారు. అంత కాకపోయినా మినిమమ్ 90కోట్ల గ్రాస్  వసూళ్లను  అందుకోవచ్చని అనుకున్నారు. 

కానీ వీకెండ్స్ అనంతరం కలెక్షన్స్ చాలా తగ్గాయి, 5వ రోజు 3కోట్లకు పైగా షేర్స్ అందుకున్న ఉప్పెన ఆరవ రోజు మాత్రం 2కోట్ల వసూళ్లను కూడా అందుకోలేకపోయింది, ఇక శుక్రవారం నాలుగు సినిమాలు రాబోతున్నాయి, విశాల్ చక్ర, నరేష్ నాంది,  సుమంత్ కపటధారి సినిమాలతో పాటూ కన్నడ డబ్బింగ్ సినిమా పొగరు భారీగానే రిలీజ్ అవుతున్నాయి, మరి ఈ నాలుగు సినిమాలకు ధీటుగా ఉప్పెన ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.



Post a Comment

Previous Post Next Post