మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాల్యుబుల్ ఆర్టిస్ట్ గా మారాడు. సేతుపతి ఎంత బిజీగా ఉన్నాడు అంటే.. అతను డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా సినిమాలను వదులుకోవాల్సి వస్తోందట. ఆ రేంజ్ లో తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మాస్టర్, ఉప్పెన సినిమాలతో తెలుగులో అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఇక మన అగ్ర దర్శకులు సేతుపతి కోసం క్యారెక్టర్స్ క్రియేట్స్ చేస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ సినిమాలో కూడా విలన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో విజయ్ సేతుపతి పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తాడని రూమర్స్ చాలానే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మారికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.
Follow @TBO_Updates
Post a Comment