పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ రేంజ్ ఏమిటో మరోసారి ఋజువయ్యింది. గత సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ సినిమాలపై ఏ మాత్రం ప్రభావం చూపదని కూడా అర్ధమయ్యింది. వకీల్ సాబ్ సినిమాకు పెట్టిన పెట్టుబడికి ఆల్ మోస్ట్ ఓటీటీ డిజిటల్ రైట్స్ ద్వారానే సగానికి పైగా డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 9న రానున్న విషయం తెలిసిందే.
వకీల్ సాబ్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక శాటిలైట్ హక్కులను జీ తెలుగు అందుకుంది. ఈ రెండు డీలింగ్స్ లలో సినిమాకు మొత్తంగా 45 నుండి 50కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు సమాచారం. దిల్ రాజు, బోణి కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా థమన్ మ్యూజిక్ అంధించాడు. త్వరలోనే మరో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment