Vaishnav Tej next movie Title is fixed!!


ఉప్పెన సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా 70కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ ముందుగానే పసిగట్టేసింది. సుకుమార్ అయితే వందకోట్ల సినిమా కానుందని ప్రమోషన్ బాగానే చేశారు. ఇక ఫైనల్ గా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు.

అయితే ఉప్పెన రిలీజ్ కంటే ముందే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమాను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమాను కొండపొలం నవల  ఆధారంగా తెరకెక్కించారు. ఇక సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇప్పట్లో అయితే ఆ న్యూ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని అనుకోవడం లేదట. ఉప్పెన హడావుడి మొత్తం ఎండ్ అయిన తరువాతనే క్రిష్ ఆ కొత్త మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.



Post a Comment

Previous Post Next Post