Uppena movie OTT Price and details!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉప్పెన క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సినిమా విడుదలై 11రోజులైనా కూడా షేర్స్ కోట్లల్లోనే అందుతున్నాయి. ఇక 70కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్ డోస్ పెంచింది. ఇక సినిమాను బాలీవుడ్ ,తమిళ్ లో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాకాలు జరుగుతున్నాయి.

అయితే ఉప్పెన ఓటీటీ హక్కులను అందుకున్న నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు స్ట్రీమ్ కాబోతోందనే విషయం వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏప్రిల్ 11న రానున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా ఓటీటీ హక్కులను 7కోట్లకు అందుకున్నట్లు టాక్ అయితే వస్తోంది. లాక్ డౌన్ లో సినిమాను డైరెక్ట్ లో ఓటీటీలో రిలీజ్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ నిర్మాతలకు  16కోట్ల వరకు ఆఫర్ చేసిందట. కానీ హీరో,హీరోయిన్, దర్శకుడి కెరీర్ కు ఎంతో కీలకమైన మొదటి సినిమా కావడంతో అలా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని బిగ్ స్క్రీన్ పై రిలీజ్ చేశారు.



Post a Comment

Previous Post Next Post