ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఉప్పెన విడుదల కంటే ముందే వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమా కొండపోలం నవల
ఆధారంగా తెరకెక్కింది. ఇక అనంతరం సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
అసలు మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు అక్కినేని నాగార్జున నిర్మాతగా నిర్మించనున్న కొత్త సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. ఉప్పెన హిట్టయిన సందర్బంగా వైష్ణవ్ తేజ్ కు ఇప్పుడు మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. మరో రెండేళ్ల వరకు బిజీగా ఉండేలా కమిట్మెంట్స్ అయితే ఇచ్చాడట. అయితే వీలైనంత వరకు సొంతంగా కథలను సెలెక్ట్ చేసుకోకుండా మెగా హీరోల సలహా మేరకు ముందుకు వెళుతున్నట్లు సమాచారం.

Post a Comment