సౌత్ ఇండియన్ బిగ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోతున్న సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన గాసిప్స్ అభిమానుల్లో కాస్త కన్ఫ్యూజన్ ను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో దర్శకుడు శంకర్ చాలా బిజీగా ఉన్నాడు. ఇక నిర్మాత దిల్ రాజుతో ఎప్పటికప్పుడు సినిమాపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం దర్శకుడు శంకర్ ముందుగా అనిరుధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకోగా ఇప్పుడు దిల్ రాజు దేవి శ్రీ ప్రసాద్ ను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుదిరితే ఇద్దరి చేత డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. సరికొత్తగా మ్యూజిక్ అంధించడంలో ఇద్దరు ఇద్దరే కాబట్టి శంకర్ లాంటి దర్శకుడి చేతిలో పడితే అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగలరు. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment