టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బాక్సాఫీస్ హిట్ నమోదైనట్లు క్లారిటీ వచ్చేసింది. ఉప్పెన అనంతరం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో నాంది సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటోంది. గత 8 ఏళ్లుగా హిట్టు మాట వినని నరేష్ ఈ సినిమా విజయంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. సినిమాకు మొదటి రోజు కంటే శనివారం బుకింగ్స్ ఊపందుకున్నాయి.
అయితే ఈ సినిమాకు మొదట అల్లరి నరేష్ ను అనుకోలేదట. డైరెక్టర్ హరీష్ శంకర్ శిష్యులలో ఒకడైన దర్శకుడు విజయ్ కనకమేడల కథ రాసుకున్నప్పుడు మొదట శర్వానంద్ ను అనుకున్నాడట. అయితే శర్వానంద్ నాంది కథపై అంతగా ఇంట్రెస్ట్ చూపలేదట. అతను రిజెక్ట్ చేయడంతో నిర్మాత సతీష్ వేగేశ్న నరేష్ ను సజెస్ట్ చేయడంతో సింగిల్ సిట్టింగ్ లో అతను ఒకే చేశాడని తెలుస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసింది. మొత్తానికి శర్వానంద్ రిజెక్ట్ చేయడం నరేష్ కు కలిసొచ్చింది.
Follow @TBO_Updates
Post a Comment