కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న హీరోల్లో ఇళయదలపతి విజయ్ ఒకరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రెండు వందలకోట్ల బిజినెస్ చేయడం కామన్. పెట్టిన పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ ను అందిస్తూ ఉంటాడు. ఇక విజయ్ కు టాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉందని మాస్టర్ సినిమాతో మరోసారి ఋజువయ్యింది.
నిజం చెప్పాలంటే విజయ్ ఇంతవరకు టాలీవుడ్ మార్కెట్ పై కరెక్ట్ గా ఫోకస్ చేయలేదు. తమిళ్ ఆడియెన్స్ ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా పాన్ ఇండియా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నయనతార కోలమావు కోకిల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో తన 65వ సినిమా చేస్తున్న విజయ్ ఆ సినిమాను బిగ్ బడ్జెట్ తో అన్ని భాషల్లో భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ వేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 200కోట్లు ఖర్చు చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్. ఇక విజయ్ అన్ని భాషల్లో ప్రమోషన్ కూడా చేయాలని అనుకుంటున్నాడట. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment