లెక్చరర్ గా ఉన్నప్పుడు సుకుమార్ జీతం తెలిస్తే.. షాక్ అవ్వలిసిందే!!


దర్శకుడిగా సక్సెస్ కావాలి అంటే మొదట్లో వేసే అడుగులు చాలా కఠినంగా ఉంటాయి. ఇప్పుడున్న స్టార్ దర్శకులందరు కూడా ఒకప్పుడు చెమటోడ్చి పైకొచ్చినవారే. ఇక సుకుమార్ లాంటి క్రియేటివ్ దర్శకుడు కొన్నాళ్ల పాటు సహాయక దర్శకుడిగా పని చేసి కెరీర్ ను స్టార్ట్ చేశాడు. కాకినాడలోని ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లో సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ గా కొన్నాళ్ల పాటు వర్క్ చేశారు.

లెక్చరర్ గా అప్పుడు సుకుమార్ నెల జీతం 70వేలు అని ఆయన శిష్యుడు బుచ్చిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 1998లో అది చాలా ఎక్కువ జీతం అని ఎకరం పొలం ఆ టైమ్ లో 50వేలు ఉండేదని అన్నాడు. ఆ స్థాయిలో జీతం అందుకున్న సుకుమార్ మొదట వివి.వినాయక్ డైరెక్ట్ చేసిన దిల్  సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి నెలకు 500రూపాయలు అందుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇక ఆర్య సినిమా నుంచి మొదలైన సుక్కు కెరీర్ రంగస్థలం వరకు వచ్చింది. రేపు పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడని చెప్పవచ్చు.



Post a Comment

Previous Post Next Post