క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన శిష్యుల సినిమాలను మాత్రం ఏ మాత్రం మారువడం లేదు. సుకుమార్ రైటింగ్స్ లో రానున్న రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలు రాబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఉప్పెన హిట్టుతో ఆయన బ్రాండ్ మరింత పెరిగింది.
ఉప్పెన సినిమా ప్రొడక్షన్ లో సుకుమార్ కూడా ఒక పాట్నర్ కాబట్టి ఆయనకు వచ్చిన లాభాల్లో సగం వాటా దక్కింది. ఇక ఆ వచ్చిన మొత్తం ప్రాఫిట్స్ ను సుకుమార్ వైష్ణవ్ తేజ్ అన్న సాయి ధరమ్ తేజ్ సినిమాపై పెట్టబోతున్నాడని తెలుస్తోంది. సుకుమార్ మరో శిష్యుడు కార్తిక్, సాయి ధరమ్ తేజ్ తో ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా BVSN ప్రసాద్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు సుకుమార్. ఉప్పెనతో వచ్చిన లాభాలను మొత్తం ఆ సినిమాపైననే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment