తన గురువు EVV. సత్యనారాయణ తరహాలోనే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల ప్రస్తుతం సక్సెస్ లేక డౌన్ అయిన విషయం తెలిసిందే. ఆగడు నుంచి సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతుండడంతో ఎలాగైనా మళ్ళీ హిట్టు కొట్టి ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం ఢీ ప్రాంచెస్ లో ఢీ అండ్ ఢీ అంటూ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు.
మంచు విష్ణు కూడా ఆ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అయితే ఆ సినిమా అనంతరం శ్రీనువైట్ల దూకుడు సీక్వెల్ ను కూడా తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. స్టోరీ మెయిన్ లైన్ కూడా అనుకున్నాడట. డీ అండ్ డీ అనంతరం మహేష్ తో ఆ సీక్వెల్ లైన్ పై చర్చలు జరిపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తరువాత రాజమౌళితో మరో సినిమా చేయడానికి సిద్ధం కానున్నాడు. మరి ఈ బిజీ లైనప్ లో మహేష్ దూకుడు 2పై ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment