అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ మూవీ పుష్ప కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ పాన్ ఇండియా సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ కూడా భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫుటేజ్ ఎదో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి.
ఆ మధ్య అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సాంగ్ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు హీరోయిన్ రష్మీక ఆమె డ్యాన్స్ కు సంబంధించిన లుక్ లీక్ అయ్యింది. ఆమె గోల్డెన్ లుక్ లో కనిపిస్తున్నట్లు ఒక పోటో బయటపెట్టింది. ఆమె ఆ పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకు ఆ సాంగ్ సంబంధించిన మరొక వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియో వైరల్ కాకముందే చిత్ర యూనిట్ డిలీట్ చేసే పనులు చేపత్తినట్లు సమాచారం. ఈ లీకులు ఇంకా ఎంతవరకు వెళతాయో గాని పుష్ప యూనిట్ మాత్రం ఈ సారి కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రతకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment