మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సుజిత్ అనంతరం యూవీ క్రియేషన్స్ లో రన్ రాజా రన్ అనే సినిమాను డైరెక్ట్ చేసి బంపర్ ఆఫర్ అందుకున్నాడు. బాహుబలి లాంటి సినిమా అనంతరం ప్రభాస్ కు కథ చెప్పి సాహో తీశాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. సౌత్ లో సినిమా డిజాస్టర్ అయ్యింది.
బాలీవుడ్ లో మాత్రం ఓ వర్గం ఆడియెన్స్ ను ఆ సినిమా బాగానే ఎట్రాక్ట్ చేసింది. దీంతో నెక్స్ట్ సినిమాను సుజిత్ డైరెక్ట్ బాలీవుడ్ లోనే తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో జీ స్టూడియో సీఈఓ శరీఖ్ పటేల్ మాట్లాడుతూ.. సుజిత్ దర్శకత్వంలో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను నిర్మించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఆ సినిమా భారీ క్యాస్ట్ తో యాక్షన్ త్రిల్లర్ గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక 2022లో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు శరీఖ్ వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment