టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RRR పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తెరపైకి రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ పెంచాలని దర్శకుడు మరో ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రతి నెలలో ఎదో ఒక సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారట.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చిత్ర యూనిట్ సరైన ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు. ఇక నెక్స్ట్ అలియా భట్, అజయ్ దేవగన్ సినిమాల్లో నటిస్తుండడంతో వారితో ఒక ప్లాన్ వేశారట. అలియా బర్త్ డే మార్చ్ 15న ఉండడంతో ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక అజయ్ దేవగన్ పుట్టినరోజు కూడా ఏప్రిల్ 2న ఉండడంతో ఆయన పాత్రకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేస్తారని టాక్.
Follow @TBO_Updates
Post a Comment