రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రానున్న డిఫరెంట్ పాన్ ఇండియా సినిమాల్లో నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ఒకటి. ఇండియన్ సినిమా హిస్టారిలోనే నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కనున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఆ ప్రాజెక్టుపై రెగ్యులర్ గా ఎదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.
ఇక ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక వైజయంతి ప్రొడక్షన్ లో చేయనున్న సైన్స్ ఫిక్షన్ ఇంకా మొదలవ్వలేదు. అందుకు కారణం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతోందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ నెలలో లేదా సమ్మర్ ఎండింగ్ లో స్టార్ట్ చేయనున్నట్లు కూడా వివరణ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు పై అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్లు అర్ధమయ్యింది.
Follow @TBO_Updates
Post a Comment