Rashmika Mandana Clarifies on 2Cr remuneration!!


టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో రష్మిక మందన్న ఒకరు. అమ్మడు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో హిట్టవుతున్నాయి. గత ఎడాది బ్యాక్ టూ బ్యాక్ సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బిగ్ సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు టాక్ వచ్చింది.

ముఖ్యంగా ఒక్క సినిమాకు ఆమె రెండు కోట్లకు పైగానే తీసుకున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఆ రూమర్స్ పై రష్మిక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ స్థాయిలో నాకు రెమ్యునరేషన్ వస్తే ఎంతో సతోషిస్తానని, నిజానికి నాకు ఆ స్థాయిలో ఇవ్వడం లేదని కుండబద్దలు కొట్టేసింది. రూమర్స్ వల్ల త్వరలోనే అది నిజం కావాలని కూడా సెటైర్ వేసింది. తను ఈ స్థాయికి ఎంతో కష్టపడినట్లు చెప్పిన రష్మిక ప్రస్తుతం తన కష్టానికి తగ్గట్లుగానే పారితోషికం ఇస్తున్నట్లు చెప్పింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Post a Comment

Previous Post Next Post