Radhe Shyam another Update Loading..!!


రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బ్యూటీఫుల్ పిరియాడిక్ లవ్ స్టొరీ రాధే శ్యామ్ పనులు ఆల్ మోస్ట్ ఏండింగ్ కు వచ్చేశాయి. మొత్తానికి యూవీ క్రియేషన్స్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ అందుకోకుండా ఉండాలని ప్లాన్స్ గట్టిగానే వేస్తోంది. ఇటీవల ఒక గ్లింప్స్ ను వదిలిన విషయం తెలిసిందే. అడ్వెంచర్ లవ్ స్టోరీగా రాబోతున్నట్లు ప్రమోట్ బాగానే చేస్తున్నారు.

ఇక మ్యూజిక్ తో కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ కంపోజర్ చేత ఇప్పటికే అన్ని ట్యూన్స్ రెడీ చేయించారట. కుదిరితే మార్చ్ ఫస్ట్ వీక్ లో ఒక లవ్ సాంగ్ ను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. సినిమాను జులై 30న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ లోవు ఎలాగైనా సినిమా స్థాయిని సాంగ్స్ తోనే పెంచాలని అనుకుంటున్నారు.



Post a Comment

Previous Post Next Post