టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా మొత్తంలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని ఒక క్లారిటీ వచ్చేసింది. కేవలం తెలుగు నుంచే కాకుండా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా బడా ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయి. రాధేశ్యామ్ అనంతరం సలార్ తో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు.
ఇక తెలుగు బడా ప్రొడక్షన్ వైజయంతి బ్యానర్ లో మహానటి దర్శకుడితో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ప్రభాస్ సినిమాల కోసం 250కోట్ల నుంచి 300కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇక ఒక్కో సినిమాకు రెబల్ స్టార్ 100కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఇక ఈ నాలుగు సినిమాలకు సైన్ చేశాడు కాబట్టి మొత్తంగా 400కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. మరి ఆ సినిమాల రిజల్ట్ తరువాత ఆ లెక్కలు ఇంకా ఎంత పెరుగుతాయో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment