Prabhas 25th movie with this director??


ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకు మరో లెవెల్ కు వెళుతున్న విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాకు ఫీనిషింగ్ టచ్ చేస్తున్న డార్లింగ్ అనంతరం సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలతో రానున్నాడు.  అయితే ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించిన రూమర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

మైత్రీ మూవీ మేకర్స్ తో సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమానే 25వ ప్రాజెక్ట్. ఇక దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేదు. కానీ కొరటాల శివ ఆల్ మోస్ట్ సెట్టయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో మిర్చి సినిమా ద్వారా కొరటాల దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ తో ఎప్పటి నుంచో కొరటాల మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కానీ కమిట్మెంట్స్ ఉండడం వలన ఇద్దరికి కుదరడం లేదు. ఇక చేతిలో ఉన్న సినిమాలు అయిపోయిన తరువాత వీరి కాంబోలో మరో సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.



Post a Comment

Previous Post Next Post