పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రానున్న బిగ్ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొత్తానికి సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే ఊపందుకుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేయాలని ఒకవైపు పవన్ , మరోవైపు క్రిష్ తీరిక లేకుండా కష్టపడుతున్నారు.
అయితే సినిమా టైటిల్ పై గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. వీరుపాక్ష, హరహర మహాదేవ, బందిపోటు, హరిహర వీరమల్లు... అంటూ అనేక రకాల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ హరిహర వీరామల్లు అనే టైటిక్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అఫీషియల్ గా ఈ విషయంపై మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న క్లారిటీ ఇవ్వనున్నారు. ఆ రోజు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేయనున్నట్లు అప్డేట్ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment