పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న హిస్టారికల్ సినిమాపై రోజురోజుకు అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే దర్శకుడు క్రిష్ సెట్స్ తోనే సినిమాపై భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ను ఇంతవరకు ఎవరు చూపించని విధంగా ఒక గజ దొంగ పాత్రలో పవర్ఫుల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమా కథ మొత్తం 17వ శతాబ్దం కాలంలో కొనసాగుతుందట. అయితే ఆ కాలంలో భాగ్యనగరానికి సంబంధించిన సెట్స్ నీ రీ క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చార్మినార్ సెట్ ను రెడీ చేసిన ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గండి కోట సెట్ ను కూడా భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు మాత్రమే కాకుండా 17వ శతాబ్దంలోని భాగ్యనగరంలోని వివిధ కట్టడాలను రీ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో స్టార్ట్ కాబోయే షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సీన్స్ ను నిర్విరామంగా 10 రోజుల పాటు షూట్ చేయనున్నట్లు టాక్.
Follow @TBO_Updates
Post a Comment