NTR30.. Trivikram in Confusion!!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ ప్రాజెక్ట్ మరికొన్ని వారాల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం RRR సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న ఎన్టీఆర్ మార్చ్ లో త్రివిక్రమ్ తో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట.

మొదట ఈ సినిమా కోసం భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కీయరా అద్వానీని ఫిక్స్ చేయాలని అనుకున్నారు. అలాగే మరో ఆప్షన్ గా పూజ హెగ్డేను కూడా అనుకుంటున్నారు. త్రివిక్రమ్ మరోసారి బుట్టబొమ్మను రిపీట్ చేస్తాడా లేక కొత్త హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ పూజా హెగ్డే వైపే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు టాక్ వస్తోంది. ఇక ఈ విషయంలో ఒక క్లారిటి రావాలి అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు వేయిట్ చేయాల్సిందే.



Post a Comment

Previous Post Next Post