ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చిన తరువాత నటీనటులు దర్శక నిర్మాతలు ఒక రకంగా బిజీ అవుతున్నారనే చెప్పాలి. థియేటర్స్ భవిష్యత్తుకు గండంగా మారుతున్నట్లు కామెంట్స్ వచ్చినప్పటికీ ఓటీటీ స్థాయి ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటుందనే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక థియేటర్స్ లో చూసే సినిమాలు సెపరేట్ గా ఉంటాయని ఇటీవల వచ్చిన క్రాక్ తో అర్ధమయ్యింది.
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఓటీటీల్లో సెన్సార్ హద్దులు లేకపోవడంతో సెక్స్, వైలేన్స్, వల్గారిటీ, అభ్యుస్ వంటివి ఎక్కువ కావడంతో వాటిని అదుపులో పెట్టడానికి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనుంది. బ్రాడ్ క్యాస్టింగ్ సమాచార కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఇటీవల ఆ విషయంపై వివరణ ఇచ్చారు. త్వరలోనే కొత్త రూల్ రానుందని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా సెన్సార్ కట్ కొనసాగే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. కొత్త చట్టంపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment