అల్లరి నరేష్ మొత్తానికి 8 ఏళ్ళ అనంతరం మంచి హిట్టయితే అందుకున్నాడు. చివరగా 2012లో సుడిగాడు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న నరేష్ ఆ తరువాత సరైన విజయాన్ని అందుకోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ వసూళ్లను కూడా అందుకోలేకపోయాయి. ఇక ఫైనల్ గా నరేష్ నాంది సినిమాతో ట్రాక్ లోకి వచ్చేశాడు.
అయితే ఈ సినిమాను చూసి దిల్ రాజు చాలా ఎట్రాక్ట్ అయినట్లు నిన్నటి మీటింగ్ తోనే అర్ధమయ్యింది. సినిమా హిట్ కావడంతో స్పెషల్ గా ప్రెస్ మీట్ నిర్వహించి మరి చిత్ర యూనిట్ ను అభినందించారు దిల్ రాజు. అలాగే నరేష్ తో సినిమాను నిర్మించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాకుండా దిల్ రాజు సౌత్ లాంగ్వేజెస్ తో పాటు హిందీ రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జెర్సీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నాంది సినిమాను కూడా బాలీవుడ్ లో సొంతంగా నిర్మించవచ్చని టాక్ వస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment