టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ బుజ్జి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మహేష్ రాజమౌళికి ఒక కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే మరొక దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
ఆ దర్శకుడు మరెవరో కాదు. శ్రీమంతుడు సినిమాతో మహేష్ బాబు మార్కెట్ కు మంచి బూస్ట్ ఇచ్చిన కొరటాల శివ. అలాగే భరత్ అనే నేను సినిమాతో కూడా హిట్టిచ్చిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి సినిమా అనంతరం వీరి కాంబో సెట్స్ పైకి రావచ్చని సమాచారం. భరత్ అనే నేను సినిమాను నిర్మించిన డివివి. దానయ్య వీరి సినిమాను నిర్మించనున్నట్లు టాక్. ఇక రాజమౌళి సినిమా మొదలు కావడానికి ముందే మహేష్ మరో సినిమా చేయవచ్చని కూడా తెలుస్తోంది. చూడాలి మరి సూపర్ స్టార్ ఎలాంటి సినిమాలతో వస్తాడో..
Follow @TBO_Updates
Post a Comment