శంకర్ - రామ్ చరణ్.. హీరోయిన్ ఫిక్స్ ?


టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలపై వస్తున్న గాసిప్స్ గురించి వింటుంటే ఆ సినిమాలు థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సినిమాల్లో రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే ప్రీ ప్రొడక్షన్ కు సంబందించిన వార్తలు గుప్పుమంటున్నాయి. 

RRR తరువాత రామ్ చరణ్ చేస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా కాబట్టి దర్శకుడు శంకర్ అంచనాలకు తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నట్లున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్న ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మిక రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది అంటే క్రేజ్ మరో లెవల్ కు వెళ్లినట్లే. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.



Post a Comment

Previous Post Next Post