Gopichand Next is Another 'Temper' ??


డైరెక్టర్ మారుతి ఎలాంటి సినిమా చేసినా కూడా స్టోరీ లైన్ రొటీన్ గానే ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ మేకింగ్ తోనే తన అసలైన టాలెంట్ ను చూపిస్తుంటాడు. చెప్పిన కథే అయినప్పటికీ సింగిల్ సోల్ పాయింట్ తోనే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ను అందించగలడు. ఇక మారుతి ఈ సారి టెంపర్ లాంటి సోల్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన స్టోరీలో హీరో పాత్ర ఎలా ఉంటుందో తెలిసిందే.

అదే విధంగా మారుతి డైరెక్ట్ చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమా కథలో కూడా హీరో ఒక లాయర్ గా నేరస్తులను కేసులను గెలిపిస్తూ ఉంటాడట. డబ్బు అందగానే కమర్షియల్ గా కేసులనీ తిప్పేయడం ఆ పాత్రలో ఎక్కువగా కనిపిస్తుందట. ఇక చివరికి తన వల్ల అన్యాయమైపోయిన ఒక అమ్మాయి కుటుంబ గురించి తెలుసుకున్న హీరో సడన్ గా మారిపోతాడట. గతంలో పటాస్ స్టోరీ లైన్ కూడా అదే తరహాలో తెరకెక్కిన విషయం తెలిసిందే. సినిమాలో అయితే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. మరి మారుతి ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి.



Post a Comment

Previous Post Next Post