2021 సంక్రాంతి బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన క్రాక్ సినిమా మొత్తానికి రవితేజ కెరీర్ కీ మళ్ళీ న్యూ బూస్ట్ ఇచ్చింది. అలాగే డైరెక్టర్ గోపిచంద్ మాలినేని కూడా ఫామ్ లోకి వచ్చేశాడు. ఇదివరకు వీరు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలకృష్ణ కోసం ఒక మాస్ కమర్షియల్ కథను రెడీ చేస్తున్నాడు.
ఆ సినిమాకు కూడా దర్శకుడు క్రాక్ ఫార్ములానే వాడబోతున్నట్లు తెలుస్తోంది. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఒకప్పటి వివాదస్పద అంశాలను తీసుకొని కథను రెడీ చేస్తున్నాడట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి లోతుగా తెలుసుకున్న తరువాతే కథను స్టార్ట్ చేసినట్లు సమాచారం. క్రాక్ సినిమాను ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. మరి బాలకృష్ణతో చేయబోయే సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment