Boyapati Clarifies on #BB3 Title!!


బోయపాటి శ్రీనివాస్, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మూడవ మాస్ మసాలా సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబంధించిన టైటిల్ పై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. దీంతో రూమర్స్ డోస్ రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. అప్పుడెప్పుడో ఓ యాక్షన్ టీజర్ ను వదిలిన బోయపాటి మళ్ళీ మరో అప్డేట్ ఇవ్వలేదు. టైటిల్ పై క్లారిటీ ఇవ్వకముందే రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు.

సినిమాను తప్పకుండా మే28న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఒక క్లారిటికి వచ్చేశారు. అయితే టైటిల్ మోనార్క్ అని ఫిక్స్ చేసినట్లు గత ఏడాది నుంచి రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల బోయపాటి ఆ రూమర్స్ పై స్పందించారు. ఇంకా టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటూ షూటింగ్ పనులు పూర్తయిన తరువాతే ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. వచ్చే నెలలో వీలైతే ఆ ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వాలని కూడా బోయపాటి ఆలోచిస్తున్నారట.



Post a Comment

Previous Post Next Post