ఓ వైపు లైగర్.. మరోవైపు రొమాంటిక్!!


డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తుండడంతో ముంబైలోనే ఉంటూ షూటింగ్ స్పీడ్ పెంచుతున్నారు. పూరి గత సినిమాలు ఒక లెక్క.. లైగర్ సినిమా మరో లెక్క అనేలా ఉంటుందట. ఇక ఈ సినిమాతో పూరి మరో సినిమాతో కూడా బిజీ అవుతున్నాడట.

పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' మూవీ షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ ఎండింగ్ లో ఉంది. పూరి శిష్యుడు అనిల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ పై పూరి స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. లైగర్ పనులతో పాటు ముంబైలో స్పెషల్ గా రొమాంటిక్ సినిమాకు సంబంధించిన ఫుల్ ఎడిటింగ్ వర్క్ పూరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయట. వీలైనంత వరకు పూరి ఇన్ పుట్స్ తోనే సినిమా రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి ఆకాష్ పూరి ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి



Post a Comment

Previous Post Next Post