దర్శకధీరుడు రాజమౌళి స్థాయి పేరగడంలో కీలక పాత్ర పోషించిన రైటర్ K. విజయేంద్రప్రసాద్. అలాగే తండ్రి కథలను ప్రపంచానికి తనదైన శైలిలో పరిచయం చేసి ఆయన స్థాయిని కూడా బాగానే పెంచాడు రాజమౌళి. అయితే బాహుబలి అనంతరం విజయేంద్రప్రసాద్ కథలకు డిమాండ్ మరింత పెరిగింది. కథలు కావాలని పలు ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ చాలానే వస్తున్నాయి.
ఇక బాలీవుడ్ లో రామాయణ బ్యాక్ డ్రాప్ లో మరొ సినిమా రాబోతోంది. అలౌకిక్ దేశాయ్ అనే యువ దర్శకుడు సీత పాత్ర ఆధారంగా ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇక ఆ సినిమా పూర్తి స్క్రిప్టును విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో కూడా సినిమాను భారీగా రిలీజ్ చేస్తారట. సినిమాలో నేషనల్ లెవెల్ స్టార్ట్ క్యాస్ట్ కనిపించబోతున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment