స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారావాన్ ప్రమాదానికి గురైంది. తెలంగాణలోని ఖమ్మం సమీపంలోని సత్యనారాయణ పురం హైవే దగ్గర ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అభిమానులను ఒక్కసారిగా ఈ ఘటన షాక్ కు గురి చేసింది. అయితే కారావాన్ లో అల్లు అర్జున్ లేడని తెలుస్తోంది. కేవలం పుష్ప సినిమాకు సంబంధించిన మేకప్ టీమ్ మాత్రమే ఉన్నారట.
రెండు కీలకమైన షెడ్యూల్స్ ను రంపచోడవరం, మారేడు మిల్లి ప్రాంతాల్లో ఫినిష్ చేసుకున్న చిత్ర యూనిట్ తిరిగి హైదరాబాద్ కు బయలు దేరింది. ఇక అల్లు అర్జున్ ముందే రాజమండ్రి నుంచి ఫ్లైట్ లో వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక ఖమ్మం హైవే నుంచి హైదరాబాద్ కు వస్తున్న కారావాన్ ను వెనుక నుంచి కంటైనర్ లారీ డీ కొట్టినట్లు తెలుస్తోంది. వెనుక భాగం కొంతం డ్యామేజ్ అయ్యిందట. జనాలు ఒక్కసారిగా ఘటన స్థలానికి రావడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment